vaarthagsb.in
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 2:47 pm Posted by : వార్తా జిఎస్‌బి

*విద్యార్థుల భద్రతే ధ్యేయం* :  *పాఠశాల వద్ద శరవేగంగా స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు టిడిపి41వార్డు ఇంచార్జ్ జొన్నాడ వెంకటరమణ*

*విద్యార్థుల భద్రతే ధ్యేయం* :

*పాఠశాల వద్ద శరవేగంగా స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు వార్డు ఇంచార్జ్ జొన్నాడ వెంకటరమణ*

కాకినాడ సిటీ ఆగస్టు 4 జి ఎస్ బి వార్త

కాకినాడ నగరంలోని 41, 43వ డివిజన్ల పరిధిలో ఉన్న శ్రీ మాల కొండయ్య పాఠశాల, గాంధీనగరం మున్సిపల్ పాఠశాల సమీపంలో స్పీడ్ బ్రేకర్ల నిర్మాణ పనులు శరవేగంగా పూర్తయ్యాయి. విద్యార్థులు, వికలాంగులు మరియు పాదాచారుల భద్రతను మెరుగుపరచడమే లక్ష్యంగా ఎమ్మెల్యే వనమాడి వేంకటేశ్వర రావు (కొండబాబు) ఆదేశాల మేరకు, వార్డు ఇన్‌ఛార్జ్ జొన్నాడ వెంకటరమణ పర్యవేక్షణలో ఈ పనులు చేపట్టారు.పాఠశాల వేళల్లో వేగంగా వచ్చే వాహనాలను నియంత్రించి, చిన్నపిల్లలు మరియు వికలాంగులు ప్రమాదాల బారిన పడకుండా నివారించడమే ఈ స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు ప్రధాన ఉద్దేశం.స్థానికులు, పాఠశాల యాజమాన్యం నుంచి వచ్చిన విన్నపాలపై నాయకత్వం తక్షణమే స్పందించి పనులను కార్యరూపంలోకి తీసుకొచ్చింది.రహదారి సమస్యను వేగంగా పరిష్కరించిన ఎమ్మెల్యే కొండబాబుకు, వార్డు ఇన్‌ఛార్జ్ వెంకటరమణకు విద్యార్థుల తల్లిదండ్రులు మరియు డివిజన్ ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు, పాఠశాల యాజమాన్య ప్రతినిధులతో పాటు వార్డు పెద్దలు సరికొండ సుబ్రహ్మణ్యం, గొంగోటి ఆంజనేయులు, వల్లి ప్రసాద్, పెంకే రాధాకృష్ణ, పెన్నాడి సూరిబాబు, మోటూరి మధుసూదన్ రావు, కటకం వెంకటేశ్వరరావు, పల్లం శ్రీనివాసు, నాలం సురేంద్ర, భారతమ్మ తదితరులు పాల్గొన్నారు.