విలువలు, దేశసేవే విద్యకు మార్గదర్శకాలు కావాలి: వెంకయ్యనాయుడు

*విలువలు, దేశసేవే విద్యకు మార్గదర్శకాలు కావాలి: వెంకయ్యనాయుడు పశ్చిమగోదావరి, ఆగస్టు 8:(జిఎస్ బి వార్త) విద్యను ఒక లక్ష్యంగా, విలువలతో కూడిన సేవా మార్గంగా చూడాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.విద్యార్థులు తమ విద్యా పరిజ్ఞానానికి సంస్కారం, విలువలు, నైతికత, క్రమశిక్షణ, తమ సంస్కృతిపై గౌరవాన్ని జోడించుకోవాలని సూచించారు. విదేశాలకు వెళ్లి విద్యను అభ్యసించి, సంపాదించవచ్చని.. అయితే మాతృభూమికి తిరిగి వచ్చి దేశసేవ చేయాలని అన్నారు. ఆత్మవిశ్వాసం, సంకల్పం, కష్టపడి పనిచేసే తత్వంతో ఎలాంటి సవాళ్లనైనా అధిగమించి సమాజానికి, దేశానికి అర్థవంతమైన సేవ...