*వీఆర్‌ఓ ఏకపక్ష వైఖరిపై కలెక్టర్‌కు ఫిర్యాదు* :
*కాకినాడ రూరల్ వివాదాస్పద భూమి వద్ద బాధితుల నిరసన*
కాకినాడ రూరల్, ఆగస్టు 4 జి ఎస్ బి వార్త
కాకినాడ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో వీఆర్‌ఓ వైఖరిపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మంగళవారం వివాదాస్పద భూమి వద్ద బాధితులు విలేకరులతో మాట్లాడుతూ తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు.
తిమ్మాపురం గ్రామానికి చెందిన ముమ్మిడి లక్ష్మి, వరలక్ష్మిలకు కాకినాడ రూరల్ మండలం, తిమ్మాపురం పరిధిలోని సర్వే నంబర్ 166 స్థలానికి సంబంధించి భూ వివాదం ఉంది. ఈ సమస్య పరిష్కారం కోసం వారు 2024లోనే అధికారులకు అర్జీ ఇచ్చారు. అయితే, స్థానిక వీఆర్‌ఓ నూన్నా సత్యనారాయణ తమ పిటిషన్‌పై ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, విచారణ జరపకుండా ఏకపక్షంగా వ్యవహరించారని బాధితుల కుమారులు ఆరోపించారు. కార్లచర్ల చంద్రిక అనే వ్యక్తికి అనుకూలంగా మద్దతుగా నిలిచి ఆమెకు పాస్‌బుక్ ఇప్పించారని పేర్కొన్నారు.ఈ అక్రమ కేటాయింపుపై వీఆర్‌ఓను ప్రశ్నించగా నాకేం సంబంధం లేదుఅంటూబాధ్యతారాహిత్యంగా సమాధానం ఇచ్చారని, అందుకే ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించి, ఏకపక్షంగా వ్యవహరించిన వీఆర్‌ఓ నూన్నా సత్యనారాయణపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి. తమ అర్జీపై పూర్తిస్థాయి విచారణ పూర్తయ్యే వరకు సదరు భూమిపై పంటలు వేయకుండా, ఎలాంటి క్రయవిక్రయాలు లేదా రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరగకుండా వెంటనే నిలుపుదల ఉత్తర్వులు జారీ చేయాలి.రికార్డులను పునఃపరిశీలించి తమ భూమికి సంబంధించి తమకు త్వరితగతిన న్యాయం చేయాలని జిల్లా యంత్రాంగాన్ని బాధితులు వేడుకున్నారు.