vaarthagsb.in
Newspaper Banner
Date of Publish : 12 October 2026, 2:06 pm Posted by : వార్తా జిఎస్‌బి

వైఎస్సార్‌సీ సెల్ మండల అధ్యక్షుడిగా వడ్డీ గౌతమ్ నియామకం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ చేతుల మీదుగా గుర్తింపు కార్డు అందజేత


ఐ.పోలవరం, అక్టోబర్ 12 (జీఎస్‌బీ వార్త, రిపోర్టర్ వేణు కాశి):
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం ఐ.పోలవరం మండలం వైఎస్సార్‌సీ సెల్ మండల అధ్యక్షుడిగా టి. కొత్తపల్లి గ్రామానికి చెందిన సొసైటీ మాజీ అధ్యక్షుడు వడ్డీ గౌతమ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ చేతుల మీదుగా వడ్డీ గౌతమ్‌కు గుర్తింపు కార్డు అందజేశారు.
పార్టీ ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించడంపై వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. గతంలో టి. కొత్తపల్లి సొసైటీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉన్న వడ్డీ గౌతమ్, ఇప్పుడు మండల స్థాయిలో వైఎస్సార్‌సీ సెల్‌ను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని పార్టీ శ్రేణులు ఆకాంక్షించాయి.