vaarthagsb.in
Newspaper Banner
Date of Publish : 22 October 2026, 1:37 am Posted by : వార్తా జిఎస్‌బి

వైభవంగా విజయదశమి మహోత్సవం – 30 అడుగుల రావణ దహన0

వైభవంగా విజయదశమి మహోత్సవం – 30 అడుగుల రావణ దహన0

కాకినాడ, అక్టోబర్ 20: (జిఎస్ బి వార్త)

కాకినాడ జయేంద్రనగర్‌లోని హరే కృష్ణ మూవ్‌మెంట్ ప్రాంగణంలో అక్టోబర్ 20వ తేదీన హరే కృష్ణ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో శ్రీ వైకుంఠేశ్వర దాస మార్గదర్శకత్వంలో విజయదశమి మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.కోలాటం, శ్రీమతి పెద్దాడ సూర్యకుమారి వారిచే రామ భజన మాలిక, వైకుంఠేశ్వర దాస ప్రభుజీ ప్రవచనం, మంగళ హారతి, రావణ దహనం.ఈ సందర్భంగా నిర్వహించిన 30 అడుగుల రావణ దహన కార్యక్రమానికి 2,000 మందికి పైగా ప్రజలు హాజరై వేడుకలను తిలకించారు. భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో ప్రాంగణమంతా పండుగ వాతావరణం నెలకొంది. రావణ దహన కార్యక్రమం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది.చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలను ప్రజల్లో పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.శ్రీ వైకుంఠేశ్వర దాస మార్గదర్శకత్వంలో హరే కృష్ణ మూవ్‌మెంట్ నిర్వహించిన ఈ మహోత్సవం కాకినాడ నగరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.