శాంతినికేతన్‌లో ఘనంగా గురుపూజోత్సవం ఉపాధ్యాయుల సేవలు సమాజానికి మార్గదర్శకం
ఐ. పోలవరం, సెప్టెంబర్ 5:( జీఎస్ బి వార్త. రిపోర్టర్ వేణు కాశి) గురుపూజోత్సవం సందర్భంగా మురమళ్లలోని శాంతినికేతన్ ప్రాథమిక, హైస్కూల్‌లో శనివారం గురుపూజోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని ఉపాధ్యాయులందరినీ శాలువాలతో సత్కరించి, పూలమాలలతో ఘనంగా గౌరవించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమైనదని పేర్కొన్నారు. విద్యార్థులకు అక్షరజ్ఞానం అందించడమే కాకుండా, వారి వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడుతూ, ఉన్నత భవిష్యత్తు వైపు సరైన మార్గనిర్దేశం చేస్తున్న ఉపాధ్యాయుల సేవలు ఎనలేనివని కొనియాడారు....