శాంతియుత సమాజ నిర్మాణానికి ప్రవక్త బోధనలు ఆదర్శం* *: కాకినాడలో ఘనంగా ఈద్ మిలాదున్నబీ వేడుకలు*

కాకినాడ సిటీ ఆగస్టు 26 జి ఎస్ బి వార్త శాంతియుత సమాజ నిర్మాణానికి మహ్మద్ ప్రవక్త బోధనలు ఎంతో ఆదర్శమని ప్రముఖ న్యాయవాది ఎం.డి. జవహర్ అలీ, జామియా మసీద్ అధ్యక్షుడు ఎస్. ఏజాజుద్దీన్ పేర్కొన్నారు. ప్రవక్త బోధించిన శాంతి, సోదరభావం, మానవతా విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు.మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని బుధవారం కాకినాడ నగరంలో ముస్లిం మైనార్టీల ఆధ్వర్యంలో ఈద్ మిలాదున్నబీ వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి.జే. రామారావుపేట నుంచి ప్రారంభమైన భారీ ర్యాలీ జగన్నాథపురం వంతెన, సినిమా...