సమాజ సేవలో సిబిఎం విద్యా సంస్థల పాత్ర ప్రశంసనీయం:డిఐఇఒ రాంబాబు
కాకినాడ సిటీ ఆగస్టు 27 జి ఎస్ బి వార్త కాకినాడలోని ప్రముఖ సీబీఎం జూనియర్ కాలేజ్ ఫర్ ఉమెన్‌ను కాకినాడ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి డాక్టర్ రాంబాబు సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు,విద్యార్థినులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డిఐఇఒ డాక్టర్ రాంబాబు మాట్లాడుతూ... పూర్వకాలం నుండి సీబీఎం కళాశాల అత్యున్నత విద్యా ప్రమాణాలను అందిస్తూ వస్తోందని కొనియాడారు.ఈ కళాశాలలో చదువుకున్న అనేక మంది విద్యార్థులు విద్యావంతులై నేడు సమాజంలో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించారని...