సమ్మె వేళ.. టీ.కొత్తపల్లి ఆసుపత్రిలో DCHS ఆకస్మిక తనిఖీ

టీ.కొత్తపల్లి, అక్టోబర్ 7 (జీఎస్‌బీ వార్త): కాంట్రాక్ట్ సిబ్బంది సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో టీ.కొత్తపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి (DCHS) డా. కార్తిక్ బుధవారం సందర్శించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. నర్సింగ్, ల్యాబొరేటరీ, రేడియాలజీ సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చేపట్టిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఫార్మసీ, కేస్ షీట్లు, వివిధ వైద్య విభాగాలను తనిఖీ చేశారు. రోగులకు వైద్య సేవలు సకాలంలో అందేలా, ఆసుపత్రిలోని అన్ని సేవలు సజావుగా కొనసాగించేలా సిబ్బందికి...