vaarthagsb.in
Newspaper Banner
Date of Publish : 23 July 2026, 7:40 am Posted by : వార్తా జిఎస్‌బి

సివిల్ సప్లై ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ ను తక్షణమే క్రమబద్ధీకరించాలి*.

*సివిల్ సప్లై ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ ను తక్షణమే క్రమబద్ధీకరించాలి*.
*ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ సమస్యలపై పౌర సరఫరా శాఖ మంత్రి స్పందించాలి*…. కాకినాడ,జూలై,24: ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లయర్స్ కార్పొరేషన్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ AITUC అనుబంధ సంఘం ఆధ్వర్యంలో గురువారం ఉదయం కాకినాడ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద సివిల్ సప్లై కార్యాలయంలో పనిచేసే ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నిరసన ధర్నా జరిగింది. ధర్నాకు ముఖ్యఅతిథిగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఏపీ స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన ఆందోళనలు చేపట్టాలని రాష్ట్రవ్యాప్తంగా పిలుపునిచ్చారని. ఈ పిలుపులో భాగంగా కాకినాడ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన ఆందోళనలు నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. సివిల్ సప్లై కార్యాలయంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ కంప్యూటర్ డేటా ఆపరేటర్స్, సబర్డినేటర్స్, వాచ్మెన్లు ఏళ్ల సంవత్సరాల తరబడి విధులు నిర్వహిస్తున్నారని, వారి సేవలను, సర్వీసులను ప్రభుత్వం గుర్తించి తక్షణమే క్రమబద్ధీకరించాలని ప్రసాద్ డిమాండ్ చేశారు. పెరుగుతున్న అధిక ధరల కనుగుణంగా జీతాలు పెంచాలని, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సమానంగా పనిచేస్తున్న వారికి సమాన పనికి సమాన కనీస వేతనాలు మంజూరు చేయాలని, కనీస వేతనాలు 36 వేల రూపాయలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, అనుభవం కలిగిన అనేక సంవత్సరాల నుండి పనిచేసిన పనిచేసిన వారందరికీ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని తదితర డిమాండ్ల సాధనకై బ్లాక్ రిబ్బన్లతో ధరించి నిరసనలు తెలియజేస్తున్నారని, ఇప్పటికైనా ఈ రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కార్మికుల సమస్యలపై స్పందించాలని, వారి ఆధ్వర్యంలో వారి ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ లను పర్మినెంట్ చేయాలని ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం శివ కిషోర్ ఏ సాయికుమార్ ఎస్ రామకృష్ణ డి విజయ్ కుమార్ అజయ్ దుర్గాప్రసాద్ కిరణ్ మై అమ్మాజీ రాజమ్మ గాయత్రి రాజశేఖర్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.