సేవా కార్యక్రమాలతో జనసేనాని జన్మదిన సంబరాలు ఘనం..! ఐ.పోలవరంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు.. భారీ కేక్ కటింగ్‌తో వేడుకలు

ఐ.పోలవరం, సెప్టెంబర్ 01 (జియస్‌బి వార్త రిపోర్టర్ వేణు కాశి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ వేడుకలు ఐ.పోలవరం గ్రామంలో ఘనంగా జరిగాయి. జనసేనాని జన్మదినాన్ని కేవలం వేడుకలకే పరిమితం చేయకుండా, ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమంతో నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలు అందించారు. ఐ.పోలవరం జనసేన నాయకులు మల్లిపూడి రాజా, జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు దేవు...