*సేవా నిరతికి నిదర్శనం: పతకాల పంట పండించిన ఇంద్రపాలెం చిన్నారులు!* *నిస్వార్థ కరాటే మాస్టర్ మహమ్మద్ హాజీకి స్థానికుల ప్రశంసల జల్లు* *ఖమ్మం పోటీల్లో 10 బంగారు, 10 వెండి పతకాలతో అదరగొట్టిన విద్యార్థులు
కాకినాడ సిటీ నవంబర్ 7 జి ఎస్ బి వార్త ఆర్థిక స్తోమత లేనిదే విద్య అబ్బని నేటి రోజుల్లో, రూపాయి ఆశించకుండా గ్రామీణ ప్రాంత నిరుపేద చిన్నారులకు ఆత్మరక్షణ విద్యను నేర్పిస్తూ భావి ఛాంపియన్లుగా తీర్చిదిద్దుతున్న కరాటే మాస్టర్ మహమ్మద్ హాజీ సమాజానికే ఆదర్శప్రాయుడిగా నిలుస్తున్నారు. గత నాలుగేళ్లుగా ఇంద్రపాలెంలో కుల, మత, వర్గ విభేదాలు లేకుండా, చిన్నారుల భవిష్యత్తే ధ్యేయంగా ఆయన అందిస్తున్న ఉచిత కరాటే శిక్షణ నేడు అద్భుత ఫలితాలను ఇస్తోంది. హాజీ నిస్వార్థ సేవలకు ఫలితంగా గ్రామీణ చిన్నారులు...