స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం ఖాయం కూటమి ప్రభుత్వ అరాచకాలకు ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెబుతారు: పితాని బాలకృష్ణ
ముమ్మిడివరం, అక్టోబర్ 18 (జీఎస్బీ వార్త, రిపోర్టర్ వేణు కాశి): ముమ్మిడివరం పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) సభ్యులు పితాని బాలకృష్ణ పాల్గొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ స్థానాల్లో అత్యధిక స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులకు భరోసా కల్పిస్తూ, ఎన్నికల విజయానికి సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పుంగనూరులో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి,...