స్వచ్ఛ కాకినాడ’ మనందరి బాధ్యత* : *కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ* *పారిశుద్ధ్య పర్యవేక్షణకు వార్డు ప్రత్యేక అధికారులు* *కాలువల్లో ప్లాస్టిక్ వేస్తే కఠిన చర్యలు.. వ్యాపారులకు హెచ్చరిక* *వర్షాల నేపథ్యంలో ముందస్తు సహాయక చర్యలు*
కాకినాడ సిటీ అక్టోబర్ 23 జి ఎస్ బి వార్త నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, అధికారుల నిరంతర పర్యవేక్షణతో పాటు ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే ‘స్వచ్ఛ కాకినాడ’ సాధ్యమవుతుందని నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ స్పష్టం చేశారు. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత పటిష్టం చేసేందుకు ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రతి వార్డుకు ప్రత్యేక అధికారులను (స్పెషల్ ఆఫీసర్లు) నియమించినట్లు తెలిపారు.పారిశుద్ధ్యం, తాగునీరు, డ్రైనేజీ పూడికతీత, వీధి...