హమారా ప్రసాద్‌ను వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి భారత రిపబ్లిక్ పార్టీ డిమాండ్
ఐ. పోలవరం మండలం, ఆగస్టు 31 (జీఎస్‌బీ వార్త రిపోర్టర్ వేణు కాశి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌ను అవమానించే విధంగా ప్రచారం జరుగుతోందని ఆరోపిస్తూ, దీనికి బాధ్యుడిగా పేర్కొంటున్న హమారా ప్రసాద్‌పై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలని భారత రిపబ్లిక్ పార్టీ డిమాండ్ చేసింది. భారత రిపబ్లిక్ పార్టీ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చీకురుమెల్లి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కాశి సిద్ధార్థ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ భారత దేశ పరిపాలన మొత్తం భారత రాజ్యాంగం ఆధారంగానే కొనసాగుతోందన్నారు....