హమారా ప్రసాద్‌పై కేసు నమోదు చేయాలని దళిత సంఘాల జేఏసీ భారీ నిరసన ర్యాలీ ఎస్‌ఐ, తహశీల్దార్‌కు ఫిర్యాదు.. అంబేడ్కర్‌పై అవమానకర ప్రచారాన్ని అడ్డుకోవాలని డిమాండ్

ముమ్మిడివరం, సెప్టెంబర్ 3:( జియస్ బి వార్త రిపోర్టర్ వేణు కాశి) డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో హమారా ప్రసాద్‌గా పేర్కొంటున్న నాగులారపు వరప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం భారీ నిరసన ప్రదర్శన, ర్యాలీ నిర్వహించారు. దళిత సంఘాల జేఏసీ నాయకుడు గుర్రాల రాంబాబు మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌పై అసత్యాలు, అసంబద్ధ విషయాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సదరు అంశాలను పుస్తక రూపంలో కూడా...