ఐటీడీపీ డిజిటల్ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర దివి వెంకట తేజను అభినందించిన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు

ఐ . పోలవరం     మురమళ్ల, అక్టోబర్ 8 (జీఎస్‌బీ వార్త, రిపోర్టర్ వేణు కాశి): ముమ్మిడివరం నియోజకవర్గ ఐటీడీపీ ఉపాధ్యక్షుడు దివి వెంకట తేజను ప్రభుత్వ విప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) అభినందించారు. మురమళ్లలోని ఎమ్మెల్యే కార్యాలయంలో దివి వెంకట తేజ మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా ఐటీడీపీ వార్ రూమ్–మైటీడీపీ యాప్ యాక్టివేషన్ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నందుకు తనకు అందిన పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ను ఎమ్మెల్యేకు చూపించారు. పార్టీ డిజిటల్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, మైటీడీపీ యాప్ ద్వారా...