vaarthagsb.in
Newspaper Banner
Date of Publish : 30 October 2026, 4:12 pm Posted by : వార్తా జిఎస్‌బి

నాలుగు రోజులైనా కదలని అధికారులు.. ఢిల్లీ నారాయణ చొరవతో తొలగిన భారీ వృక్షాలు! కరవాక లంక గ్రామానికి చేరుకున్న ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం.. రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ కోరుకొండ సత్యనారాయణ (ఢిల్లీ నారాయణ) ప్రత్యేక చొరవతో సమస్యకు పరిష్కారం రహదారిపై కూలిన చెట్లతో ప్రజలకు తప్పని ఇబ్బందులు.. మాజీ రిటైర్డ్ ఎస్‌ఐ బొమ్మిడి వెంకటేశ్వరరావు విజ్ఞప్తితో స్పందన

డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా | ముమ్మిడివరం నియోజకవర్గం

ఐ. పోలవరం:     అక్టోబర్ 31( జీఎస్  బి వార్త) ఆర్నబ్ తుపాను బీభత్సం సృష్టించి నాలుగు రోజులు గడుస్తున్నా.. ఐ. పోలవరం మండలం గుత్తెనదీవి పంచాయతీ పరిధిలోని కరవాక లంక గ్రామంలో ప్రజల సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. తుపాను ధాటికి గ్రామంలో రెండు భారీ వృక్షాలు విరిగి ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే ప్రధాన రహదారిపై పడిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోజుల తరబడి చెట్లు రహదారిపైనే ఉండటంతో గ్రామస్తులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఈ సమస్యను గుర్తించిన మాజీ రిటైర్డ్ ఎస్‌ఐ బొమ్మిడి వెంకటేశ్వరరావు ప్రజల ఇబ్బందులను రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ కోరుకొండ సత్యనారాయణ (ఢిల్లీ నారాయణ) దృష్టికి తీసుకెళ్లారు. గ్రామస్తుల సమస్యను తెలుసుకున్న ఢిల్లీ నారాయణ ప్రత్యేక చొరవ తీసుకుని సంబంధిత యంత్రాంగంతో మాట్లాడి కరవాక లంక గ్రామానికి ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం చేరుకునేలా కృషి చేశారు.

ఆయన చొరవతో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం గ్రామానికి చేరుకుని రహదారిపై అడ్డంగా పడిన భారీ వృక్షాలను తొలగించే చర్యలు చేపట్టింది. దీంతో నాలుగు రోజులుగా రాకపోకలకు ఆటంకంగా మారిన సమస్యకు పరిష్కారం లభించింది. రహదారి మార్గం పునరుద్ధరణతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.

ప్రజల సమస్యపై స్పందించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేసిన ఢిల్లీ నారాయణకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు అవసరమైన సమయంలో స్పందించి సహాయక చర్యలకు చొరవ చూపడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు.