నాలుగు రోజులైనా కదలని అధికారులు.. ఢిల్లీ నారాయణ చొరవతో తొలగిన భారీ వృక్షాలు! కరవాక లంక గ్రామానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం.. రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ కోరుకొండ సత్యనారాయణ (ఢిల్లీ నారాయణ) ప్రత్యేక చొరవతో సమస్యకు పరిష్కారం రహదారిపై కూలిన చెట్లతో ప్రజలకు తప్పని ఇబ్బందులు.. మాజీ రిటైర్డ్ ఎస్ఐ బొమ్మిడి వెంకటేశ్వరరావు విజ్ఞప్తితో స్పందన
డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా | ముమ్మిడివరం నియోజకవర్గం ఐ. పోలవరం: అక్టోబర్ 31( జీఎస్ బి వార్త) ఆర్నబ్ తుపాను బీభత్సం సృష్టించి నాలుగు రోజులు గడుస్తున్నా.. ఐ. పోలవరం మండలం గుత్తెనదీవి పంచాయతీ పరిధిలోని కరవాక లంక గ్రామంలో ప్రజల సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. తుపాను ధాటికి గ్రామంలో రెండు భారీ వృక్షాలు విరిగి ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే ప్రధాన రహదారిపై పడిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోజుల తరబడి చెట్లు రహదారిపైనే ఉండటంతో గ్రామస్తులు,...