ఐ. పోలవరం జెడ్పీటీసీ అభ్యర్థుల పోలింగ్ బూత్ల పరిశీలన ఎన్నికల నిర్వహణ తీరును పరిశీలించిన బీర సత్యకుమారి, సకిలే పద్మావతి
ఐ. పోలవరం నవంబర్ 05( జీఎస్ బి వార్త ) ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఐ. పోలవరం మండల ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని వివిధ పార్టీల జెడ్పీటీసీ అభ్యర్థులు పరిశీలించారు. తెలుగుదేశం పార్టీ కూటమి జెడ్పీటీసీ అభ్యర్థి బీర సత్యకుమారి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి సకిలే పద్మావతి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రంలో ఓటింగ్...