vaarthagsb.in
Newspaper Banner
Date of Publish : 23 July 2026, 10:32 am Posted by : వార్తా జిఎస్‌బి

*రాష్ట్రంలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం 44.8 చేరింది: ఎంపీ సానా సతీష్ బాబు ప్రశ్నకు కేంద్రం వివరణ*

 

న్యూఢిల్లీ, జూలై 23: (జిఎస్ బి వార్త)


ఆంధ్రప్రదేశ్‌లో మహిళల ఉపాధి భాగస్వామ్యం, నైపుణ్యాభివృద్ధి, స్వయం సహాయక సంఘాల పాత్ర, మహిళల సాధికారత కోసం కేంద్రం చేపడుతున్న చర్యలపై రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వ వివరణ.దీనికి సమాధానంగా కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS)-2025 ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో మహిళల శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు (LFPR) 2021-22లో 43.3 శాతం ఉండగా, 2023-24 నాటికి 44.8 శాతం కూడా పెరిగిందని, 2025లో అదే స్థాయిలో కొనసాగుతోంది. అలాగే మహిళల వర్కర్ పాప్యులేషన్ రేషియో (WPR) 2021-22లో 41.8 శాతం నుంచి 2023-24లో 43.1 పెరిగినట్లు నమోదు.మహిళల ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు స్కిల్ ఇండియా మిషన్, PMKVY, JSS, NAPS, CTS, FutureSkills PRIME వంటి పథకాలు అమలు చేయడానికి అవకాశం కల్పిస్తుంది. అలాగే ELI పథకం, నేషనల్ కెరీర్ సర్వీస్ (NCS) పోర్టల్ ద్వారా ఉపాధి, నైపుణ్యాభివృద్ధి సేవలు అందిస్తోంది.అదేవిధంగా, సమాన పనికి సమాన వేతనం, ప్రసూతి ప్రయోజనాలు, కార్యాలయాల్లో మహిళల భద్రత, రాత్రి వేళల్లో కూడా తగిన భద్రతతో ఉపాధి అవకాశాలు కల్పించేలా కొత్త కార్మిక చట్టాల్లో నిబంధనలు తీసుకొచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మహిళల సాధికారత కోసం ‘మహిళల నేతృత్వంలోని అభివృద్ధి’ దిశగా చర్యలు చేపడుతున్నామని, వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లు, క్రెచ్‌లు ఏర్పాటు చేయడం వంటి చర్యలు కూడా అమలు చేస్తున్నారు.