6000 మంది విద్యార్థుల సంతకాలతో సీఎం చంద్రబాబు కు
శ్యామ్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకుడు, చైర్మన్ జి శ్యామ్

శ్యామ్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకుడు, చైర్మన్ జి శ్యామ్
కాకినాడ, (జిఎస్ బి వార్త )
ఉభయగోదావరి జిల్లాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ మర్యాదపూర్వకంగా కలిశారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రాజశేఖర్, శ్యామ్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకుడు, చైర్మన్ జి శ్యామ్ సీఎం నీ కలిసి రాబోయే పోలీస్ నియామక నోటిఫికేషన్ లో పదివేలకు పైగా పోలీస్ యూనిఫామ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ 6000 మంది విద్యార్థుల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకి అందజేశారు..
