ఆక్రమణలకు గురైన డ్రెయిన్ పరిధి పునరుద్ధరణ కొంగోడులో నిలిచిపోయిన బ్రిడ్జి పనులను పరిశీలించిన కాకినాడ రూరల్   ఏమ్మెల్యే పంతం నానాజీ

.కరప (జిఎస్ బి వార్త) కరప మండలంలో శహాపురం డ్రెయిన్ పనులను మంగళవారం  ఎమ్మెల్యే పంతం నానాజీ పరిశీలించారు.పంటలకు వరద ముప్పు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని, ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకువాలని అధికారులను ఆదేశించారు .కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి, రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతోందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ  తెలిపారు. ఐదవ పంట కాలంలోనూ “ఒక ఎకరం నీరు తడారకూడదు! ఒక ఎకరం మునిగిపోకూడదు!” అనే నినాదంతో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు కలిసికట్టుగా శ్రమిస్తున్నారని...