న్యూసెన్స్ చేస్తూ మార్పు చేసిన సైలెన్సర్లను అమర్చిన వాహనాలపై అపరాధ రుసుం విధించి సైలెన్సర్లు ధ్వంసం చేసిన కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్

    Date:

    📰 Generate e-Paper Clip

    శబ్దకాలుష్య కారక సైలెన్సర్లు ధ్వంసం

    ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి*

    కాకినాడ ఎస్పీ బిందు మాధవ్*

    కాకినాడ, ఆగస్టు 11:(జిఎస్ బి వార్త)

    శబ్ద తీవ్రతను అధిక స్థాయిలో కలుగజేస్తూ న్యూసెన్స్ చేస్తూ మార్పు చేసిన సైలెన్సర్లను అమర్చిన వాహనాలపై అపరాధ రుసుం విధించి సైలెన్సర్లు ధ్వంసం చేశామని కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ పేర్కొన్నారు.    మంగళవారం కాకినాడ భానుగుడి దగ్గరలో ఉన్న ట్రాఫిక్ టు పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం అధిక శబ్దం కలిగించే సైలెన్సర్లో కలిగి ఉన్న వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. 60 డిసిమల్ దాటి శబ్దం రావడం వలన ఆ శబ్ద కాలుష్యాన్ని కలుగచేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న వారిని ఉపేక్షించేది లేదన్నారు. మరియు ఆ శబ్ద కాలుష్యానికి చెవుడు వచ్చే ప్రమాదం ఉందన్నారు. వాహనదారులకు మరియు పాదదారులకు గుండెకు సంబందించిన రోగాలు రావడం,ఇతర అనారోగ్య సమస్యలు కలుగచేస్తూ ఇతర వాహనదారులు, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న మాడిఫైడ్ సైలెన్సర్లు వినియోగిస్తున్న వాహన దారులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి మాడిఫైడ్ సైలెన్సర్లు కలిగిఉన్న వాహనాలను గుర్తించి, సదరు వాహన దారులకు జరిమానాలు విధిస్తున్నట్లు ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. అలాగే మోటారు వాహన చట్టం ప్రకారము శబ్దకాలుష్యo కలిగించే సైలెన్సర్లు కలిగి ఉన్న వాహణదారులపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా వాహనాలకు అమర్చిన సుమారు రూ.22,50,000/-లు విలువ చేసే 540 మాడిఫైడ్ సైలెన్సర్లను వాహనముల నుండి తొలగించి మాడిఫైడ్ సైలెన్సర్లను జప్తు చేసారు. 2025 సంవత్సరములో 169 కేసులకు గాను 2,20,500 రూపాయలు అపరాధ రుసుము మరియు 2026 సంవత్సరములో 841 కేసులకు గాను 12.61,605 రూపాయలు అపరాధ రుసుము, రెండు సంవత్సరములకు గాను మొత్తము 1010 కేసులకు గాను 14,82,105 రూపాయలు అపరాధ రుసుము విధించారు.      ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఎం కిషోర్ కుమార్, ఎఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు, ట్రాఫిక్ టు సిఐ డి రామారావు, ట్రాఫిక్-1సీఐ ఎన్ రమేష్, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.

    Share post:

    Subscribe

    Popular

    More like this
    Related

    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!