నగరంలోని పార్కులు, ప్రజా ప్రదేశాలు ప్రజలకు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేలా ఉండాలని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు స్పష్టం చేశారు. గురువారం ఉదయం కాకినాడ వివేకానంద పార్క్ (రాజా ట్యాంక్ పార్క్) లో ఆయన మార్నింగ్ వాక్ చేస్తూ, స్థానిక వాకర్స్, ప్రజలతో నేరుగా ముఖాముఖి నిర్వహించారు.ఈ సందర్భంగా పార్క్ నిర్వహణ, ఎదురవుతున్న ఇబ్బందులపై ఆయన ఆరా తీశారు. వాకర్స్ ప్రధానంగా టాయిలెట్ల నిర్వహణ, డ్రైనేజీ సమస్యలు, తాగునీటి సౌకర్యం లేకపోవడం వంటి అంశాలను ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు.ప్రజల సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఎంపీ సతీష్ బాబు, తక్షణ పరిష్కారానికి హామీ ఇచ్చారు. సంబంధిత అధికారులతో మాట్లాడి పార్క్‌లో పారిశుద్ధ్యం, తాగునీరు, టాయిలెట్ల నిర్వహణ వంటి మౌలిక వసతులను వేగవంతంగా మెరుగుపరుస్తామని తెలిపారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవడం ద్వారా పరిష్కారాలు మరింత త్వరగా లభిస్తాయని, కాకినాడ నగరంలో ప్రజారోగ్యం, పచ్చదనం, మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.
వాకర్స్ సమస్యలు పరిష్కరిస్తాం* : *రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు* *కాకినాడ వివేకానంద పార్క్‌లో ఎంపీ మార్నింగ్ వాక్, వాకర్స్‌తో ప్రజలతోనేరుగా ముఖాముఖి*
Date:

