దివంగత మహానేత వైఎస్సార్ 17వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

    Date:

    📰 Generate e-Paper Clip

    పసువుల్లంక వైఎస్సార్ వారధి వద్ద వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసిన నాయకులు

    ఐ. పోలవరం, సెప్టెంబర్ 02 (జియస్‌బి వార్త రిపోర్టర్ వేణు కాశి): దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి (వైఎస్సార్) 17వ వర్ధంతి సందర్భంగా ఐ. పోలవరం మండలంలోని పసువుల్లంక వైఎస్సార్ వారధి వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

    ఈ సందర్భంగా వైఎస్సార్ ప్రజలకు అందించిన సేవలను, పేదల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషిని నాయకులు స్మరించుకున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో, ప్రజల హృదయాల్లో వైఎస్సార్‌కు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు.

    ఈ కార్యక్రమంలో మాజీ మురమళ్ల సొసైటీ అధ్యక్షుడు, వైసీపీ నాయకుడు సుంకర నాగబాబు, ధూళిపూడి నాగు, సఖిలే జ్యోతి, సంగాని శ్రీను, కావూరి శ్రీను, మోర్త అనిల్, చీకురిమెల్లి తాతారావు, చింతా శ్రీను, పెనుపోతు దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

    వైఎస్సార్ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజాసేవలో ముందుకు సాగాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు.

    Share post:

    Subscribe

    Popular

    More like this
    Related

    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!