*వేణుగోపాలస్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా అమ్మవారి శ్రీచక్ర ప్రతిష్ఠ*
*నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు*
*అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం*
*రామచంద్రపురం రూరల్ (జిఎస్ బి వార్త)
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం రూరల్ మండలం వెల్ల గ్రామంలోని శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయంలో అమ్మవారి శ్రీచక్ర ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్, క్లస్టర్ ఇన్ఛార్జి ఆకుల నారాయణరావు, ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి కృపతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు.ఈ సందర్భంగా వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ దైవభక్తి, ఆధ్యాత్మిక చింతన మనిషికి మానసిక ప్రశాంతతను అందించడంతో పాటు సమాజంలో ఐకమత్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ఆలయాల్లో నిర్వహించే పూజలు, పండుగలు మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు. ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సుంకర శ్రీనివాస్, గెడ్డం బాబురావు, వట్టికూటి ఏసుబాబు, టిడిపి సీనియర్ నేత కంచుమర్తి బాబురావు,ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
