ఐ. పోలవరం, అక్టోబర్ 22 (జీఎస్బీ వార్త, రిపోర్టర్ వేణు కాశి):
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గంలోని ఐ. పోలవరం గ్రామ ఎంపీటీసీ-2 స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దేవి రాధిక గురువారం నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలను సమర్పించారు.
ఈ కార్యక్రమంలో ఐ. పోలవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సాగిరాజు సూరిబాబు రాజు, తెలుగు యువత అధ్యక్షుడు కాకర్లపూడి రాజేష్, మాదిరెడ్డి కుమార్ పాల్గొన్నారు. పార్టీ నాయకుల సమక్షంలో దేవి రాధిక నామినేషన్ దాఖలు చేయడంతో గ్రామంలో ఎన్నికల సందడి నెలకొంది.
మండలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండటంతో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు సమర్పిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఐ. పోలవరం మండలంలో రాజకీయ కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి.


