-13 మందికి రూ.6 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
– ఇంటింటికి వెళ్లి చెక్కులు అందించిన రూరల్ టీడీపీ ఇంచార్జి “పిల్లి” దంపతులు
కరప :(జిఎస్ బి వార్త)
ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇంచార్జి పిల్లి అనంత లక్ష్మి సత్యనారాయణ మూర్తి దంపతులు తెలిపారు. కాకినాడ రూరల్ నియోజక వర్గం కరప మండలం లో కరప, కొంగోడు, విజయరాయుడుపాలెం, ఉప్పలంక, నడకుదురు, వేళంగి, సిరిపురం, కోరిపల్లి, పెద్దాపురప్పాడు, వేములవాడ తదితర గ్రామాల్లో లబ్ధిదారుల ఇండ్లకు స్వయంగా వెళ్లి స్థానిక టీడీపీ నాయకులతో కలిసి 13 మంది లబ్ధిదారులకు సుమారు రూ.6 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా పిల్లి దంపతులు మాట్లాడుతూ…ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమం, వైద్య భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సహా కూటమి ప్రభుత్వం ప్రజలకు అత్యవసర వైద్య సహాయం వేగంగా అందేలా నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులను బాధితులు నేరుగా తమ వద్దకు తీసుకొచ్చినా, స్థానిక ప్రజాప్రతినిధులు లేదా టీడీపీ నాయకుల ద్వారా అందజేసినా వాటిని వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సాధ్యమైనంత త్వరగా చెక్కులు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
వైద్య చికిత్స అవసరమైన వారు ప్రభుత్వం కల్పిస్తున్న లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌ఓసీ) సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని పూర్తి స్థాయిలో వైద్యం పొందాలని కోరారు. ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సహాయం చేరేలా నిరంతరం కృషి కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు,కార్యకర్తలు,లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.