Date of Publish : 10 July 2026, 12:02 pmPosted by : VAARTHA GSB
👉మానవత్వం చాటుకున్న కాకినాడ టూ టౌన్ సీఐ మజ్జి అప్పలనాయుడు. ——————- కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఆదేశాల మేరకు.. కాకినాడ సబ్‌డివిజన్ పరిధిలో రాత్రి రౌండ్స్ నిర్వహిస్తున్న కాకినాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ మజ్జి అప్పలనాయుడుకు గాంధీనగర్ సుబ్బయ్య హోటల్ సమీపంలో సుమారు 20 సంవత్సరాల వయస్సు గల డయాలసిస్ రోగి శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడుతూ అస్వస్థతకు గురై రోడ్డుపక్కన పడిఉన్నట్లు నైట్ బీట్ సిబ్బంది సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న సీఐ108 అంబులెన్స్ సకాలంలో అందుబాటులో లేకపోవడంతో.. బాధితురాలిని తన అధికారిక వాహనంలో అపోలో ఆసుపత్రికి తరలించి, అత్యవసర చికిత్స అందేలా ఎమర్జెన్సీ వార్డులో చేర్పించారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్, అడిషనల్ ఎస్పీ (అడ్మిన్), ఇన్‌చార్జి కాకినాడ సబ్ డివిజనల్ పోలీసు అధికారి డాక్టర్ మహంతి కిషోర్ కుమార్, జిల్లాలోని డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు, పలువురు ఎస్సైలు, స్థానికులు అభినందించారు