ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్నాలజీ విజన్, కాకినాడలో అవకాశాలపై స్కైరూట్ ఏరోస్పేస్ సహ వ్యవస్థాపకుడు పవన్ కుమార్ చందన తోఎంపీ సానా సతీష్ బాబు చర్చ

    Date:

    📰 Generate e-Paper Clip


    ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్నాలజీ విజన్, కాకినాడలో అవకాశాలపై స్కైరూట్ ఏరోస్పేస్ సహ వ్యవస్థాపకుడు పవన్ కుమార్ చందన తోఎంపీ సానా సతీష్ బాబు చర్చ

    *న్యూఢిల్లీ, జూలై 29*(జిఎస్ బి వార్త):

    భారత అంతరిక్ష రంగంలో ప్రముఖ ప్రైవేట్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ సహ వ్యవస్థాపకుడు  పవన్ కుమార్ చందన రాజ్యసభ సభ్యులు  సానా సతీష్ బాబును న్యూఢిల్లీలోమర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా భారత్‌లో ప్రైవేట్ రంగం అభివృద్ధి చేసిన తొలి ఆర్బిటల్-క్లాస్ లాంచ్ వెహికల్ ‘విక్రమ్-1’ విజయవంతమైన ప్రయోగానికి ఎంపీ సానా సతీష్ బాబు స్కైరూట్ బృందానికి అభినందనలు తెలిపారు. ఇది భారత అంతరిక్ష రంగంలో ఒక చారిత్రక మైలురాయిగా అభివర్ణించారు.సమావేశంలో ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ విద్యాశాఖ మంత్రి  నారా లోకేశ్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ను ఏరోస్పేస్, స్పేస్ టెక్నాలజీ, డీప్-టెక్ రంగాలకు ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దే కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు.అలాగే, కాకినాడ బేలోని హోప్ ఐలాండ్ వద్ద శాటిలైట్ లాంచింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి విజన్, కాకినాడకు ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యం, స్పేస్ టెక్నాలజీ, అధునాతన తయారీ పరిశ్రమలు, పెట్టుబడులు, నైపుణ్యాధారిత ఉపాధి అవకాశాలపై కూడా అభిప్రాయాలు పంచుకున్నారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రైవేట్ అంతరిక్ష సంస్థల మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసి, రాష్ట్రాన్ని భారతదేశంలో ప్రముఖ స్పేస్ మరియు ఏరోస్పేస్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కలిసి పనిచేయాలని ఇరువురు అభిప్రాయపడ్డారు.

    Share post:

    Subscribe

    Popular

    More like this
    Related

    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!