
ఐ.పోలవరం, అక్టోబర్ 12 (జీఎస్బీ వార్త, రిపోర్టర్ వేణు కాశి):
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం ఐ.పోలవరం మండలం వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడిగా టి. కొత్తపల్లి గ్రామానికి చెందిన సొసైటీ మాజీ అధ్యక్షుడు వడ్డీ గౌతమ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ చేతుల మీదుగా ఆయనకు గుర్తింపు కార్డు అందజేశారు.
వడ్డీ గౌతమ్‌కు కీలక బాధ్యతలు అప్పగించడంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. గతంలో సొసైటీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవంతో ఎస్సీ సెల్‌ను బలోపేతం చేస్తూ, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు ఆకాంక్షించారు.
