Thursday, October 22, 2026
More
    HomeUncategorizedఐ. పోలవరంలో ఘనంగా షిర్డీ సాయిబాబా ఆలయ 26వ వార్షికోత్సవం లక్ష తులసి పూజ, మహా...

    ఐ. పోలవరంలో ఘనంగా షిర్డీ సాయిబాబా ఆలయ 26వ వార్షికోత్సవం లక్ష తులసి పూజ, మహా అన్నదానం కార్యక్రమాలు

    📰 Generate e-Paper Clip

    ఐ. పోలవరం, అక్టోబర్ 21 (జీఎస్‌బీ వార్త, రిపోర్టర్ వేణు కాశి):

    విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గంలోని ఐ. పోలవరం గ్రామంలో శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయ 26వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో లక్ష తులసి పూజ, మహా అన్నదానం కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు, గ్రామస్థులు పాల్గొని సాయిబాబా ఆశీస్సులు పొందారు.

    ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్, ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు), మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద హాజరయ్యారు.

    అలాగే దాట్ల పృథ్వీ, రాయపురెడ్డి నీళ్లకంటేశ్వరరావు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సాగిరాజు సూరిబాబురాజు, జంపన బాబు, కలిదిండి రాజేష్, కాకర్లపూడి బుజ్జి, రాయపురెడ్డి రాజా, దాట్ల సతీష్, బొంతు ప్రసాద్, దేవు రాంబాబు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

    కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విజయదశమి పర్వదినాన సాయిబాబా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, మహా అన్నదానం భక్తులలో ఆధ్యాత్మిక ఆనందాన్ని నింపాయి. భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టడంతో ఆలయ ప్రాంగణం భక్తజన సందోహంతో సందడిగా మారింది.

    RELATED ARTICLES

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Most Popular

    Recent Comments

    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!