కరపలో జాతీయ క్రీడ దినోత్సవం, తెలుగు భాష దినోత్సవం

    Date:

    📰 Generate e-Paper Clip

    కరపలో జాతీయ క్రీడ దినోత్సవం, తెలుగు భాష దినోత్సవం

    కరప (జిఎస్ బి వార్త)

    మండల కేంద్రం కరప శ్రీ నక్క సూర్యనారాయణ మూర్తి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల లో శనివారం జాతీయ క్రీడ దినోత్సవం, తెలుగు భాష దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వరి ధ్యాన్ చంద్, గిడుగు వెంకట రామమూర్తి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ముద్రగడ రమేష్ మాట్లాడుతూ హై స్కూల్ విద్యార్థులకు ప్రభుత్వం తరఫున ఏ విధమైన సహాయ సహకారాలను అందించడానికి అయినా కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేశారు. మాజీ సర్పంచ్ పోలిశెట్టి నారయ్య తాతీలు ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి క్రీడలలో పాల్గొన్న బాల బాలికలకు పదివేల రూపాయల తో క్రీడా దుస్తులను రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయులు వెలుగుబంట్ల గోపాలకృష్ణ అందించారు. ఈ కార్యక్రమానికి, మండల విద్యాశాఖ అధికారి పత్తి సత్యనారాయణ జిల్లా తెలుగుదేశం ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవు వెంకటేశ్వరరావు, పంచాయతీ సెక్రెటరీ దుర్గ భవాని, వేపకాయల రాజు సానాశివ, గ్రామ పెద్దలు పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయుని బృందం పాల్గొన్నారు.

    Share post:

    Subscribe

    Popular

    More like this
    Related

    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!