ఘనంగా పిన్నమరాజు వెంకటపతిరాజు (శ్రీనురాజు) 55వ జన్మదిన వేడుకలు నాలుగు మండలాల నుంచి తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు

    Date:

    📰 Generate e-Paper Clip

    ఘనంగా పిన్నమరాజు వెంకటపతిరాజు (శ్రీనురాజు) 55వ జన్మదిన వేడుకలు

    నాలుగు మండలాల నుంచి తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు

    ఐ. పోలవరం, ఆగస్టు 29 (జియస్‌బి వార్త రిపోర్టర్ వేణు): అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని ఐ. పోలవరం మండలం కేశనకుర్రు గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మండల కన్వీనర్ పిన్నమరాజు వెంకటపతిరాజు (శ్రీనురాజు) 55వ జన్మదిన వేడుకలను శనివారం అత్యంత ఘనంగా నిర్వహించారు.

    కేశనకుర్రులోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకలకు నాలుగు మండలాల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జన్మదిన వేడుకల సందర్భంగా పార్టీ కార్యాలయం సందడిగా మారగా, అభిమానుల కోలాహలం మధ్య కేక్ కటింగ్‌తో వేడుకలు ఉత్సాహభరితంగా సాగాయి.

    ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ హాజరై శ్రీనురాజుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు శ్రీనురాజును ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు.

    ఈ సందర్భంగా శ్రీనురాజు మాట్లాడుతూ, తన 55వ జన్మదినాన్ని పురస్కరించుకుని నాలుగు మండలాల నుంచి తరలివచ్చి తనకు శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఇంతటి ప్రేమాభిమానాలు చూపడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు.

    ప్రతి సందర్భంలో తనకు అండగా నిలుస్తున్న నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ప్రేమను ఎప్పటికీ మరువలేనని శ్రీనురాజు అన్నారు. ప్రజల ఆశీస్సులు, పార్టీ నాయకులు, కార్యకర్తల సహకారంతో మరింత ఉత్సాహంగా ప్రజాసేవకు కృషి చేస్తానని తెలిపారు.

    ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీఈసీ సభ్యులు పితాని బాలకృష్ణ, కాశి మునికుమారి, కోరుకొండ సత్యనారాయణ (ఢిల్లీ నారాయణ), జెడ్పీటీసీ సభ్యులు ముదునూరి సతీష్ రాజు, వైస్ ఎంపీపీ మీరియం జ్యోతి, వైస్ ఎంపీటీసీ పిన్నమరాజు బాబ్జీరాజు, సుంకర నాగబాబు, పెనుమత్స వాసురాజు, వల్లభుని దొరబాబు, వడ్డి గౌతమ్, విత్తనాల శ్రీనివాసరావు, కొర్లపాటి ప్రసాద్, సాధనాల బాబురావు, వలవల రామకృష్ణ, మోకా రవి, కాశి పరివాజ్ కుమార్, పండు విజయ్, కొండేపూడి ప్రసాద్, సఖిలే వెంకటేశ్వరరావు, మొండా వెంకటేశ్వరరావు, మోర్తా చిన్నా, మట్టా గగన వీరుడు, యలమంచిలి వాసు, రేవు వెంకటేశ్వరరావు తదితర పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా అందరూ కలిసి పిన్నమరాజు వెంకటపతిరాజు (శ్రీనురాజు)కు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, ఆయన ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

    Share post:

    Subscribe

    Popular

    More like this
    Related

    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!