కరప కలెక్టర్ ఒక నెల – ఒక గ్రామం” ప్రజా సమస్యల పరిష్కార వేదిక
ట్రైనీ కలెక్టర్ ప్రియా ఆధ్వర్యంలో 95పిర్యాదు లు స్వీకరణ
ఎంపీటీసీ లు గౌరవ వేతనం రావడం లేదని కరప ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి పిర్యాదు
కరప, ఆగస్టు 7:(జిఎస్ బి వార్త)
కరపలోని మండల ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం కాకినాడ రూరల్ నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన “ఒక నెల – ఒక గ్రామం” ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తాయి. రాష్ట్ర మంత్రుల జిల్లా పర్యటన కారణంగా జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ ఈ సమావేశానికి హాజరుకాలేదు.ట్రైనీ కలెక్టర్ ప్రియా, రూరల్ ని యోజకవర్గ ప్రత్యేకాధికారి, కాకినాడ ఆర్టీఓ ఎస్. మల్లిబాబు, , డీడీఓ పి. వాసుదేవరావు బాధితుల నుంచి వినతులను స్వీకరించారు. కరప, కాకినాడ రూరల్ మండలాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.ఈ ప్రజా వేదికలో 95 పిర్యాదు లు రాగా సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణాలు, తల్లికి వందనం పథకం లబ్ధి, ఇళ్ల స్థలాల పట్టాలు, హౌసింగ్ రుణాలు, ఆసైన్డ్ భూములను 22ఎ జాబితా నుంచి తొలగించాలనే డిమాండ్లపై ఎక్కువ అర్జీలు వచ్చాయి. ముఖ్యంగా జెడ్. భావరం ప్రాంతం నుంచి రోడ్లు, డ్రెయిన్ల కోసం ఏకంగా 40 కి పైగా అర్జీలు రాగా, వేళంగిలో లీకవుతున్న పీహెచ్‌సీ భవనానికి నిధులు ఇవ్వాలని కూటమి నాయకులు వినతిపత్రం ఇచ్చారు.
ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం త్వరలో ముగియనున్నా గత మూడేళ్లుగా గౌరవ వేతనం రావడం లేదని కరప ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మిసత్తిబాబు అధికారులు కు ఎంపీటీసీ లు తరపున పిర్యాదు అందించారు . కాకినాడ భానుగుడి సెంటర్‌లోని బస్ షెల్టర్ లోపాలు, కరప మెయిన్ రోడ్డులో చిరువ్యాపారుల ఆక్రమణలు, మార్కెట్ సెంటర్‌లో ఆటోల వల్ల తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యలు, జగనన్న కాలనీల్లో వీధిదీపాలు, రోడ్ల లేమిపై స్థానికులు సంతకాలతో కూడిన వినతులను కరప మాజీ సర్పంచ్ పోలిశెట్టి తాతిలు, టీడీపీ నాయకులు దేవు వెంక్కన్న వినతి అందించారు. పంట కాలువల ఆక్రమణ, ఆక్వా చెరువుల కలుషిత నీటి విడుదల, భూ విస్తీర్ణంలో వ్యత్యాసాలపై కూడా పలు ఫిర్యాదులు నమోదయ్యాయి.అందిన ప్రతి అర్జీని ఆన్‌లైన్‌లో నమోదు చేశామని, ఆర్థికేతర సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని ప్రత్యేకాధికారి మల్లిబాబు తెలిపారు. అభివృద్ధి పనులకు సంబంధించిన వినతులపై ఎంత ఖర్చు అవుతుందో వెంటనే అంచనాలు (ప్రతిపాదనలు) తయారు చేసి నివేదిక ఇవ్వాలని మండల స్థాయి అధికారులను ఆయన ఆదేశించారు. సంబంధిత శాఖాధికారుల సమక్షంలో సమస్యలను చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కరప, కాకినాడరూరల్ మండలాల ఎంపీడీఓలు జె. శ్రీనివాస్, ఎస్.సతీష్, కరప తహసీల్దార్ ఆకుల లక్ష్మీసరస్వతి,డిప్యూటీ ఎంపీడీఓలు ఎస్వీ శ్రీనివాసరావు,మండల సచివాలయాల అధికారి కర్రి శ్రీనివాసరావు,ఎం ఈ ఓ కొప్పుల బుల్లి కృష్ణ వేణి,వివిధశాఖల అధికారులు, కార్యదర్శి లు, వి ఆర్ ఓ లు, అధికారులు పాల్గొన్నారు..