కరప లో ఒక నెల – ఒక గ్రామం” ప్రజా సమస్యల పరిష్కార వేదిక కలెక్టర్  గ్రీవెన్స్  ట్రైనీ కలెక్టర్ ఆధ్వర్యంలో 95 పిర్యాదు లు స్వీకరణ  ఎంపీటీసీ లు గౌరవ వేతనం రావడం లేదని కరప ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి పిర్యాదు  ట్రైని కలెక్టర్  శ్రీ ప్రియా , ఆర్డీఓ  మల్లిబాబు, డి డి ఓ పి. వాసుదేవరావు  పిర్యాదు లు స్వీకరణ

    Date:

    📰 Generate e-Paper Clip

    కరప లో ఒక నెల – ఒక గ్రామం” ప్రజా సమస్యల పరిష్కార వేదిక కలెక్టర్  గ్రీవెన్స్ 

    ట్రైనీ కలెక్టర్ ఆధ్వర్యంలో 95 పిర్యాదు లు స్వీకరణ 

    ఎంపీటీసీ లు గౌరవ వేతనం రావడం లేదని కరప ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి పిర్యాదు 

    ట్రైని కలెక్టర్  శ్రీ ప్రియా , ఆర్డీఓ  మల్లిబాబు, డి డి ఓ పి. వాసుదేవరావు  పిర్యాదు లు స్వీకరణ

    కరప, ఆగస్టు 7:(జిఎస్ బి వార్త)

    శుక్రవారం ​కరపలోని మండల ప్రజాపరిషత్ లో  కాకినాడ రూరల్ నియోజకవర్గ స్థాయి “ఒక నెల – ఒక గ్రామం” ప్రజా సమస్యల పరిష్కార వేదికకు95 అర్జీలు స్వీకరించారు. ​రాష్ట్ర మంత్రుల జిల్లా పర్యటన కారణంగా జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ ఈ సమావేశానికి హాజరుకాలేదు.నియోజకవర్గ ప్రత్యేకాధికారి, కాకినాడ ఆర్టీఓ ఎస్. మల్లిబాబు, ట్రైనీ కలెక్టర్ శ్రీ ప్రియ, డీడీఓ పి. వాసుదేవరావు బాధితుల నుంచి వినతులను స్వీకరించారు. కరప, కాకినాడ రూరల్ మండలాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.​ఈ గ్రీవెన్స్ లో 95 పిర్యాదు లు  సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణాలు, తల్లికి వందనం పథకం లబ్ధి, ఇళ్ల స్థలాల పట్టాలు, హౌసింగ్ రుణాలు, ఆసైన్డ్ భూములను 22ఎ జాబితా నుంచి తొలగించాలనే డిమాండ్లపై ఎక్కువ అర్జీలు అందాయి . ముఖ్యంగా జెడ్. భావరం ప్రాంతం నుంచి రోడ్లు, డ్రెయిన్ల కు సుమారు 40 కి పైగా అర్జీలు , వేళంగిలో లీకవుతున్న పీహెచ్‌సీ భవనానికి నిధులు ఇవ్వాలని కూటమి నాయకులు వినతిపత్రం ఇచ్చారు. ​దీంతో పాటు, ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం త్వరలో ముగియనున్నా గత మూడేళ్లుగా గౌరవ వేతనం రావడం లేదని కరప ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి సత్తిబాబు  ఎంపీటీసీ లు తరపున పిర్యాదు చేశారు . కాకినాడ భానుగుడి సెంటర్‌లోని బస్ షెల్టర్ లోపాలు, కరప మెయిన్ రోడ్డులో చిరువ్యాపారుల ఆక్రమణలు, మార్కెట్ సెంటర్‌లో ఆటోల వల్ల తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యలు సమస్య పై కరప మాజీ సర్పంచ్ పోలిశెట్టి తాతిలు, టీడీపీ నాయకులు దేవు వెంకన్న పిర్యాదు చేశారు. జగనన్న కాలనీల్లో వీధిదీపాలు, రోడ్ల లేమిపై స్థానికులు సంతకాలతో కూడిన వినతులను సమర్పించారు. పంట కాలువల ఆక్రమణ, ఆక్వా చెరువుల కలుషిత నీటి విడుదల, భూ విస్తీర్ణంలో వ్యత్యాసాలపై కూడా పలు ఫిర్యాదులు నమోదయ్యాయి.

    అందిన ప్రతి అర్జీని ఆన్‌లైన్‌లో నమోదు చేశామని, ఆర్థికేతర సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని ప్రత్యేకాధికారి మల్లిబాబు తెలిపారు. అభివృద్ధి పనులకు సంబంధించిన వినతులపై ఎంత ఖర్చు అవుతుందో వెంటనే అంచనాలు (ప్రతిపాదనలు) తయారు చేసి నివేదిక ఇవ్వాలని మండల స్థాయి అధికారులను ఆయన ఆదేశించారు. సంబంధిత శాఖాధికారుల సమక్షంలో సమస్యలను చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కరప, కాకినాడరూరల్ మండలాల ఎంపీడీఓలు జె. శ్రీనివాస్, ఎస్.సతీష్, కరప తహసీల్దార్ ఆకుల లక్ష్మీసరస్వతి,ఎంపీడీఓ జె శ్రీనివాస్,డిప్యూటీ ఎంపీడీఓలు ఎస్వీ శ్రీనివాసరావు,మండల సచివాలయాల అధికారి కర్రి శ్రీనివాసరావు, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.

    Share post:

    Subscribe

    Popular

    More like this
    Related

    గొల్లపాలెం సహకార బ్యాంకు లో ఏటీఎం పగలుగొట్టి నగదు చోరీ  సీఐ కృష్ణ చైతన్య పరిశీలన

    గొల్లపాలెం సహకార బ్యాంకు లో ఏటీఎం పగలుగొట్టి నగదు చోరీ సీఐ కృష్ణ...

    ఐ.పోలవరం మండలం ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎస్. అమీన్

    భీమ్‌నగర్‌లో ఘన సన్మానం.. అభినందించిన గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఐ.పోలవరం: సెప్టెంబర్...

    నూతన ఎన్.టి.ఆర్. భరోసా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం

    ఐ.పోలవరం సెప్టెంబర్ 07(జీఎస్ బి వార్త రిపోర్టర్ వేణు కాశి)ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...
    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!