*కాకినాడలో ‘ఇన్కాయిస్’ ( NIOT/INCOIS) ప్రాంతీయ కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరిన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు**కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్కు వినతిపత్రం అందజేత*
*న్యూఢిల్లీ, జూలై 23:(జిఎస్ బి వార్త)*
*కాకినాడలో జాతీయ సముద్ర సాంకేతిక సంస్థ (NIOT) లేదా ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (INCOIS)* ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ *రాజ్యసభ సభ్యులు శ్రీ సానా సతీష్ బాబు* కేంద్ర *భూవిజ్ఞాన శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్*ను గురువారం కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సానా సతీష్ బాబు మాట్లాడుతూ, కాకినాడ తూర్పు తీరంలో అత్యంత కీలకమైన సముద్ర తీర నగరంగా, ప్రధాన ఫిషింగ్ హార్బర్, హోప్ ఐలాండ్, గోదావరి డెల్టా ప్రాంతాలకు సమీపంలో ఉండటంతో పాటు CMFRI, జేఎన్టీయూ-కాకినాడ వంటి ప్రముఖ పరిశోధనా సంస్థలు ఉండటం వల్ల సముద్ర పరిశోధన, సాంకేతిక అభివృద్ధికి అత్యంత అనుకూల ప్రాంతమని వివరించారు.ప్రస్తుతం INCOIS ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉండగా, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి దాదాపు 500 కిలోమీటర్ల దూరంలో ఉండడం వల్ల తీరప్రాంత అవసరాలకు తక్షణ సేవలు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. కాకినాడలో ప్రాంతీయ కేంద్రం ఏర్పాటు చేస్తే సముద్ర పరిశోధన, ప్రత్యక్ష పర్యవేక్షణ, తీరప్రాంత ప్రజలకు సేవలు మరింత సమర్థవంతంగా అందించే అవకాశం ఉంటుందని కేంద్ర మంత్రిని తెలిపారు.ఈ కేంద్రం ఏర్పాటు ద్వారా సముద్ర పరిశోధన, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, *Potential Fishing Zone (PFZ)* సమాచార సేవలు, తీరప్రాంత ప్రజలకు శిక్షణ కార్యక్రమాలు మరింత బలోపేతం అవుతాయని పేర్కొన్నారు. అలాగే, ఇది కేంద్ర ప్రభుత్వ *బ్లూ ఎకానమీ* లక్ష్యాలకు, ఆంధ్రప్రదేశ్ సముద్ర ఆర్థికాభివృద్ధికి కీలకంగా దోహదపడుతుందని తెలిపారు. వినతిపత్రాన్ని స్వీకరించిన కేంద్ర మంత్రి *డాక్టర్ జితేంద్ర సింగ్* ఈ ప్రతిపాదనను సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

