కాకినాడలో కోలాహలంగా ‘అమరావతి ఛాంపియన్‌షిప్–2026’ ప్రారంభం: 7 జిల్లాల నుంచి 600 మంది బాలికల భాగస్వామ్యం

    Date:

    📰 Generate e-Paper Clip

    కాకినాడలో కోలాహలంగా ‘అమరావతి ఛాంపియన్‌షిప్–2026’ ప్రారంభం: 7 జిల్లాల నుంచి 600 మంది బాలికల భాగస్వామ్యం

    కాకినాడ సిటీ ఆగస్టు 12 జి ఎస్ బి వార్త

    ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ (SAAP) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “అమరావతి ఛాంపియన్‌షిప్–2026” పోటీలు స్థానిక కాకినాడ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (DSA) మైదానంలో బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏడు జిల్లాల నుంచి విచ్చేసిన దాదాపు 600 మంది బాలికలు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.అండర్–17, అండర్–23 విభాగాల్లో మొత్తం 12 రకాల క్రీడాంశాల్లో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన MLC కర్రి పద్మశ్రీ క్రీడాకారిణులను ఉద్దేశించి మాట్లాడారు. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో క్రీడల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆమె ఆకాంక్షించారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు నాయకత్వ లక్షణాలు, జట్టు స్ఫూర్తి, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యాన్ని పెంపొందిస్తాయని చెప్పారు. పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకుని, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని బాలికలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో KUDA చైర్మన్ సత్య, DSDO సతీష్ కుమార్, SETRAJ CEO, ఆర్గనైజింగ్ సెక్రటరీ రవి రాజ్, సుధారాణి తదితర అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు. యువ క్రీడాకారిణుల్లోని ప్రతిభను వెలికితీసి ఉన్నత స్థాయికి తీర్చిదిద్దేందుకు ఈ ఛాంపియన్‌షిప్ చక్కని వేదికగా నిలుస్తుందని

    Share post:

    Subscribe

    Popular

    More like this
    Related

    ఐ.పోలవరం మండలం ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎస్. అమీన్

    భీమ్‌నగర్‌లో ఘన సన్మానం.. అభినందించిన గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఐ.పోలవరం: సెప్టెంబర్...

    నూతన ఎన్.టి.ఆర్. భరోసా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం

    ఐ.పోలవరం సెప్టెంబర్ 07(జీఎస్ బి వార్త రిపోర్టర్ వేణు కాశి)ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

    పసిపిల్లల గాయాలకు డిటర్జెంట్ సబ్బా?

      అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కుక్కకాటు చికిత్సపై విచారణ జరపాలి వైద్య నిర్లక్ష్యాన్ని సమర్థించుకునేందుకు...
    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!