కాకినాడ, జూలై 26(జిఎస్ బి వార్త): అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ శరవణ ఆధ్వర్యంలో ఆదివారం కార్గిల్ విజయ్ దివస్ను పురస్కరించుకుని కాకినాడ జిల్లా కోర్టు ఎదురుగా ఉన్న అమరవీరుల స్థూపం వద్ద అమర జవాన్లకు ఘన నివాళులు అర్పించారు.క్లబ్ అధ్యక్షులు యాళ్ళ రత్నారావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన వీర జవాన్ల స్మారకార్థం సభ్యులు పుష్పాంజలి ఘటించి, కొవ్వొత్తులు వెలిగించి శ్రద్ధాంజలి అర్పించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు యాళ్ళ రత్నారావు మాట్లాడుతూ, కార్గిల్ యుద్ధంలో భారత సైనికులు ప్రదర్శించిన అపూర్వ ధైర్యసాహసాలు, త్యాగం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని అన్నారు. దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను అర్పించిన అమర వీరులను ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. క్లబ్ వ్యవస్థాపకులు దిలీప్ కుమార్ సధనాని మాట్లాడుతూ, కార్గిల్ విజయ్ దివస్ అనేది కేవలం ఒక స్మారక దినం మాత్రమే కాదని, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవాన్ల పట్ల కృతజ్ఞతను చాటుకునే పవిత్రమైన సందర్భంగా అభివర్ణించారు. వారి త్యాగ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని సమాజ సేవతో పాటు దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరారు. జిల్లా చైర్మన్ ఆర్. రవిశంకర్ పట్నాయక్ మాట్లాడుతూ, కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం సాధించిన విజయం దేశ చరిత్రలో చిరస్మరణీయమని, అమర వీరుల త్యాగాలను భావితరాలకు తెలియజేయడం ప్రతి భారతీయుడి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ఉపాధ్యక్షులు యడవిల్లి మురళీధర్, వీ.డీ.జీ చిట్టూరి వీరవర ప్రసాద్, పడాల సూర్యనారాయణ రెడ్డి, పి. సేతు మాధవరావు, విజయదుర్గ ఆటో అసోసియేషన్ సభ్యులు పి. అప్పారావు, అనుసూరి కాశేవ, పి. రాజు, Ch. మణికంఠ స్వామి తదితరులు పాల్గొన్నారు. చివరిగా క్లబ్ కార్యదర్శి దామిశెట్టి శ్రీనివాసరావు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.
కార్గిల్ వీరుల త్యాగం భారత జాతికి చిరస్మరణీయం” – అమరవీరుల స్థూపం వద్ద అలయన్స్ క్లబ్ శరవణ ఘన నివాళులు
Date:

“కార్గిల్ వీరుల త్యాగం భారత జాతికి చిరస్మరణీయం” – అమరవీరుల స్థూపం వద్ద అలయన్స్ క్లబ్ శరవణ ఘన నివాళులు