- *కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న కొవ్వూరు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు…*

ఆత్రేయపురం (జిఎస్ బి వార్త)
కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారిని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. వారు స్వామివారికి చేసిన ఏడు వారాల మొక్కును పూర్తి చేసుకుని, ఈరోజు నిర్వహించిన అష్టోత్తర పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.అనంతరం ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను సత్కరించి, స్వామివారి చిత్రపటాన్ని మరియు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
