తల్లిపాలే శిశువుకు తొలి రక్షణ కవచం – ధాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ*

    Date:

    📰 Generate e-Paper Clip



    తల్లిపాలే శిశువుకు తొలి రక్షణ కవచం – ధాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ*

    ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ధాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం తల్లిపాల ప్రాముఖ్యతపై విస్తృత అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎం. కిషోర్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అనిత, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి ముఖ్య అతిథులుగా పాల్గొని ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ధాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీకి వైద్య సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తల్లిపాల ప్రాధాన్యతను వివరిస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ ఎం. కిషోర్ కుమార్ మాట్లాడుతూ, శిశువుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తల్లిపాలు అత్యంత అవసరమని అన్నారు. ప్రతి తల్లి తన బిడ్డకు పుట్టిన గంటలోపే తల్లిపాలు ఇవ్వడం ప్రారంభించాలని, మొదటి ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలే అందించాలని సూచించారు. తల్లిపాలపై సమాజంలో మరింత అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అనిత మాట్లాడుతూ, తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారమని, రోగనిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయని తెలిపారు. ఆరు నెలల తర్వాత తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారం అందించినా, రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం తల్లిపాలు కొనసాగించాలని సూచించారు. తల్లులు అపోహలకు లోనుకాకుండా వైద్యుల సూచనలు పాటించాలని కోరారు.జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి మాట్లాడుతూ, తల్లిపాలు బిడ్డ ఆరోగ్యానికే కాకుండా తల్లి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయని చెప్పారు. ప్రసూతి అనంతరం తల్లులకు తల్లిపాల ప్రాముఖ్యతపై ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నామని, ప్రతి కుటుంబం తల్లిపాల ప్రాధాన్యతను గుర్తించి తల్లులకు పూర్తి సహకారం అందించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తల్లిపాల ప్రాముఖ్యతపై నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించగా, ప్రజలు ఆసక్తిగా వీక్షించారు. అనంతరం తల్లిపాలపై అవగాహన కల్పించే కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ధాత్రి ఫౌండేషన్ ప్రతినిధులు, వైద్యులు, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

    Share post:

    Subscribe

    Popular

    More like this
    Related

    గొల్లపాలెం సహకార బ్యాంకు లో ఏటీఎం పగలుగొట్టి నగదు చోరీ  సీఐ కృష్ణ చైతన్య పరిశీలన

    గొల్లపాలెం సహకార బ్యాంకు లో ఏటీఎం పగలుగొట్టి నగదు చోరీ సీఐ కృష్ణ...

    ఐ.పోలవరం మండలం ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎస్. అమీన్

    భీమ్‌నగర్‌లో ఘన సన్మానం.. అభినందించిన గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఐ.పోలవరం: సెప్టెంబర్...

    నూతన ఎన్.టి.ఆర్. భరోసా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం

    ఐ.పోలవరం సెప్టెంబర్ 07(జీఎస్ బి వార్త రిపోర్టర్ వేణు కాశి)ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...
    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!