యంత్రపు నావ / బోటులో చేపల వేటలో” టిండాల్ కం డ్రైవర్ ” కోర్సు 75 వ బ్యాచ్

    Date:

    📰 Generate e-Paper Clip

     

     

     

    ఆధునిక సాంకేతిక పద్ధతులతో యంత్రపు నావ / బోటులో చేపల వేటలో” టిండాల్ కం డ్రైవర్ ” కోర్సు 75 వ బ్యాచ్ నందు 01.09.2026 తేది నుండి ఒక సంవత్సర కాలము (12 నెలలు) శిక్షణ పొందుటకు దరఖాస్తులు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రములు మరియు పుదిచ్చేరి (UT) నుండి అర్హతలు గల అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి.

    పూర్తి చేసిన దరఖాస్తుతో పాటు సంబంధిత సర్టిఫికేట్లు యొక్క నకళ్లను జతపరచి తేది 10.08.2026 సోమవారం సాయంకాలము 5.00 గంటల లోపుగా ఆయాజిల్లా మత్స్య శాఖ అధికారి వారి కార్యాలయములో అందజేయవలెను లేదా నేరుగా కూడా ఈ కార్యాలయమునకు అందునట్లు పోస్టల్ ద్వారా పంపించవచ్చును.

    దరఖాస్తు చేసుకున్న అర్హులైన అభ్యర్థులకు తేది 20.08.2026 గురువారం ఉదయం 10.00 గంటలకు రాష్ట్ర మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థ, జగన్నాధపురం, కాకినాడ -2 కార్యాలయము నందు ఒరిజినల్ సర్టిఫికేట్లతో ఇంటర్వ్యూకు హాజరు కావలసి యుండును. దరఖాస్తు నమూనా మరియు పూర్తి వివరములు ది. 10.07.2026 నుండి www.fisheries.ap.gov.in నందు లభ్యమగును.

    Previous article
    👉మానవత్వం చాటుకున్న కాకినాడ టూ టౌన్ సీఐ మజ్జి అప్పలనాయుడు. ——————- కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఆదేశాల మేరకు.. కాకినాడ సబ్‌డివిజన్ పరిధిలో రాత్రి రౌండ్స్ నిర్వహిస్తున్న కాకినాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ మజ్జి అప్పలనాయుడుకు గాంధీనగర్ సుబ్బయ్య హోటల్ సమీపంలో సుమారు 20 సంవత్సరాల వయస్సు గల డయాలసిస్ రోగి శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడుతూ అస్వస్థతకు గురై రోడ్డుపక్కన పడిఉన్నట్లు నైట్ బీట్ సిబ్బంది సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న సీఐ108 అంబులెన్స్ సకాలంలో అందుబాటులో లేకపోవడంతో.. బాధితురాలిని తన అధికారిక వాహనంలో అపోలో ఆసుపత్రికి తరలించి, అత్యవసర చికిత్స అందేలా ఎమర్జెన్సీ వార్డులో చేర్పించారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్, అడిషనల్ ఎస్పీ (అడ్మిన్), ఇన్‌చార్జి కాకినాడ సబ్ డివిజనల్ పోలీసు అధికారి డాక్టర్ మహంతి కిషోర్ కుమార్, జిల్లాలోని డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు, పలువురు ఎస్సైలు, స్థానికులు అభినందించారు
    Next article

    Share post:

    Subscribe

    Popular

    More like this
    Related

    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!