హత్య కేసు ఛేదించిన త్రీ టౌన్ పోలీసులు  ముగ్గురు నిందితులు అరెస్ట్ 

    Date:

    📰 Generate e-Paper Clip

    హత్య కేసు ఛేదించిన త్రీటౌన్ పోలీసులు

    ముగ్గురు నిందితులు అరెస్ట్

    సి ఐ కె వీ ఎస్. సత్యనారాయణ ను అభినందించిన ఎస్పీ బిందు మాధవ్

    కాకినాడ, (జిఎస్ బి వార్త )

    10

    నగరంలో మొజ్జు సతీష్ హత్య కేసును త్రీ టౌన్ పోలీసులు చేధించారు. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) మహంతి కిషోర్ కుమార్, సీఐ ఐ కె వి ఎస్ . సత్యనారాయణ లు వివరాలు. ఈ ఏడాది మే 10 న మొజ్జు సతీష్ మృతదేహం అనుమానాస్పద స్థితిలో పడి ఉన్నట్లు సమాచారం రావడంతో కేసు నమోదు చేశామని చెప్పారు. దర్యాప్తులో భాగంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది. ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాలతో కేసు ప్రత్యేక దృష్టి పెట్టి అదనపు ఎస్పీ మహంతి కిషోర్ కుమార్ పర్యవేక్షణలో ప్రత్యేక క్రైమ్ బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు నిర్వహించామని చెప్పారు. దర్యాప్తులో భాగంగా శుక్రవారం కుంచె ప్రభు తేజ, కుంచె నాని, పెరుగు అంజలి అలియాస్ రాణిలను అరెస్ట్ చేశామని చెప్పారు. వారి వద్ద నుంచి నేరానికి ఉపయోగించి న ద్విచక్ర వాహనం, మసాలా దాంచే కర్ర, ప్లాస్టిక్ గొట్టం, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని అన్నారు. నిందితుడు ప్రభు తేజ వద్ద మృతుడు సతీష్ హెల్పేర్ గా పనిచేసే వాడని అన్నారు. నిందితుడు ప్రభు తేజ కాకినాడ కుర్రోడు పేరుతో వీడియోలు తీసేవాడని తెలిపారు. మృతి చెందిన సతీష్ ప్రభు తేజ ఇంట్లో 30,000 రూపాయల నగదు, మూడు సెల్ ఫోన్లు దొంగిలించాడని, అవి తిరిగి ఇవ్వకపోవటంతో పాటు దూషించడం వల్ల హత్య చేయాలని పథకం రూపొందించారని దర్యాప్తులో తేలిందని చెప్పారు. మే 9 తేదీ న మృతుడిని తీవ్రంగా కొట్టి గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం మృత దేహాన్ని సీసీ కెమెరాలు లేని మార్గం ద్వారా ద్విచక్ర వాహనం పై తీసుకెళ్లి సాంబమూర్తి నగర రెండవ వీధిలో చెట్టు కింద పడేశారని వివరించారు. కేసు ను త్వరితగతిన ఛేదించిన త్రీ టౌన్ సి ఐ కె వి ఎస్. సత్యనారాయణ, ఎస్ ఐ సత్యనారాయణ చౌదరి, ఎస్ ఐ శ్రీనివాసు, హెడ్ కానిస్టేబుల్ సతీష్, కానిస్టేబుల్ మురళీ రాజు లను, క్రైమ్ పోలీస్ సిబ్బంది నీ ఎస్పీ బిందు మాధవ్‌తో పాటు జిల్లాకు అభినందనలు తెలిపారు.

    Share post:

    Subscribe

    Popular

    More like this
    Related

    ఐ.పోలవరం మండలం ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎస్. అమీన్

    భీమ్‌నగర్‌లో ఘన సన్మానం.. అభినందించిన గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఐ.పోలవరం: సెప్టెంబర్...

    నూతన ఎన్.టి.ఆర్. భరోసా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం

    ఐ.పోలవరం సెప్టెంబర్ 07(జీఎస్ బి వార్త రిపోర్టర్ వేణు కాశి)ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

    పసిపిల్లల గాయాలకు డిటర్జెంట్ సబ్బా?

      అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కుక్కకాటు చికిత్సపై విచారణ జరపాలి వైద్య నిర్లక్ష్యాన్ని సమర్థించుకునేందుకు...
    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!