వెలిగొండ ప్రాజెక్ట్ సాధనలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం – 30 ఏళ్ల కరువు సీమ కల నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

    Date:

    📰 Generate e-Paper Clip

     

    వెలిగొండ ప్రాజెక్ట్ సాధనలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం – 30 ఏళ్ల కరువు సీమ కల నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

    కాకినాడ సిటీ25 ఆగస్టు,(జిఎస్ బి వార్త)

    వెలిగొండ ప్రాజెక్ట్ సాధనలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం – 30 ఏళ్ల కరువు సీమ కల నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని మాజీ మేయర్ & ముమ్మిడివరం నియోజక వర్గ పరిశీలకురాలు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి.సుంకర పావని తిరుమల కుమార్ తెలిపారు. ఉమ్మడి ప్రకాశం మరియు రాయలసీమ ప్రాంతాలకు కృష్ణా జలాలను అందించి, కరువు రహిత ప్రాంతంగా మార్చేందుకు 1996 మార్చి 5న నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. నాడు తీసుకున్న పట్టుదలతో అవాంతరాలన్నింటినీ అధిగమించి, సరిగ్గా 30 ఏళ్ల తర్వాత అదే చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆగస్టు 31న వెలిగొండ ప్రాజెక్ట్ ఫేజ్-1ను ప్రారంభించి నల్లమల సాగర్‌కు నీటిని విడుదల చేయబోతున్నారు.   గతంలో నిలిచిపోయిన పునరావాస (R&R) ప్రక్రియకు శ్రీకారం చుట్టి, నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచింది. ప్రాజెక్ట్ నిర్వాసితులకు ఇప్పటికే విడతలవారీగా దాదాపు రూ. 768 కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం విడుదల చేసింది.  ఫేజ్-1 ద్వారా 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది,ఫేజ్-2 పూర్తయితే మొత్తం 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు 23 లక్షల మందికి స్వచ్ఛమైన తాగునీరు అందుతుంది.   తాగునీటిలో తీవ్ర ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్న ఈ ప్రాంతంలో జల్ జీవన్ మిషన్ మరియు వెలిగొండ ప్రాజెక్టు జలాల ద్వారా ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం చూపుతున్నామన్నారు.వెలిగొండ జలసిరులతో పాటు మార్కాపురం ప్రాంతంలో పారిశ్రామిక, వాణిజ్య పురోగతి కోసం బెంగుళూరు-అమరావతి హైవే, రామాయపట్నం పోర్టు అనుసంధానంతో పాటు హార్టికల్చర్ హబ్‌లకు శ్రీకారం చుడుతున్నాము. ప్రతి రైతు పొలానికి నీరు, ప్రతి యువకుడికి ఉపాధి, ప్రతి కుటుంబానికి భరోసా” అనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. దశాబ్దాల కరువుకు ముగింపు పలుకుతూ, శ్రీశైలం మల్లన్న పాదాల చెంత నుంచి మార్కాపురం చెన్నకేశవుని నేలకు కృష్ణమ్మను తీసుకువస్తున్న ఈ చారిత్రక ఘట్టంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని సుంకర పావని పిలుపునిచ్చారు.

    Previous article
    Next article

    Share post:

    Subscribe

    Popular

    More like this
    Related

    పసిపిల్లల గాయాలకు డిటర్జెంట్ సబ్బా?

      అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కుక్కకాటు చికిత్సపై విచారణ జరపాలి వైద్య నిర్లక్ష్యాన్ని సమర్థించుకునేందుకు...

    రూ.1,700 కోట్ల అభివృద్ధి పరుగులు.. ముమ్మిడివరంలో దాట్ల మార్క్‌!

    నాలుగు మండలాలు.. ఒకే విజన్‌.. అభివృద్ధి బాటలో...

    రూ.1,700 కోట్ల అభివృద్ధి జోరు.. ముమ్మిడివరంపై దాట్ల మార్క్‌!

    నాలుగు మండలాలు.. అభివృద్ధి, సంక్షేమానికి...
    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!