Date:

    📰 Generate e-Paper Clip

     

    ఆషాఢం సారె – గోరింటాకు పండుగ!

     

    కరప (జిఎస్ బి వార్త)

    జిల్లాలో మన ఊరు మన గ్రామ దేవత పేరుతో ఆషాడం సారె – గోరింటాకు పండుగ అన్ని గ్రామాలల్లో జరపాలని జిల్లా ధర్మ ప్రచారక్ పడాల రఘు తెలిపారు.

    కరప మండలం పెనుగుదురు గ్రామంలో ఆయన మాట్లాడుతూ విజయవాడ లో జరిగిన ప్రాంత సమావేశాలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ కార్యక్రమ పై ప్రస్తావన జరిగిందన్నారు. మహిళా విభాగం ఆధ్వర్యంలో ధార్మిక జట్టు ఆధారంగా ఈ కార్యక్రమం జరగాలని సూచించారు. ఎవరికి వారు తమ తమ గ్రామాలలో ఉన్న గ్రామ దేవతలకు మాత్రమే సారె సమర్పించాలని తెలిపారు. ప్రచార ఆర్భాటాలుతో పొరుగు ఊరు గ్రామ దేవతలకు సారె సమర్పిస్తే లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉంటుందన్నారు.అలాగే గోరింటాకు ఆడ మగ తేడా లేకుండా ధరించాలని ఇది పెద్ద ఎత్తున పండుగులా జరుపుకోవాలని సూచించారు.దేవాలయాల ద్వారా ఆత్మ సుద్ది జరగాలే కాని వ్యాపారాలకు, రాజకీయాలుకు తావుండకూడదన్నారు

    రాష్ట్ర వ్యాప్తంగా మన ఊర్లో మన గ్రామ దేవత పేరుతో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు

    కాకినాడ జిల్లా నుండి ప్రాంత సమావేశానికి జిల్లా కన్వీనర్ కంబాల నారాయణ రావు, జిల్లా మహిళా సహా కన్వీనర్ వాసం శెట్టి సూర్యవతి, కాకినాడ ఖండ కన్వీనర్ కరెడ్ల చక్రి, పిఠాపురం ఖండ కన్వీనర్ రామ సుబ్బారెడ్డి, ప్రత్తిపాడు ఖండ కన్వీనర్ తోలేటి రామకృష్ణ, తుని ఖండ కన్వీనర్ బర్ల రామ కృష్ణ పాల్గొన్నారు

    Share post:

    Subscribe

    Popular

    More like this
    Related

    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!