50 ఏళ్ల సుదీర్ఘ న్యాయవాద ప్రస్థానంలో గోకుల కృష్ణ
కాకినాడ, (జిఎస్ బి వార్త )50 ఏళ్ల సుదీర్ఘ న్యాయవాద ప్రస్థానంలో గోకుల కృష్ణ
అనేక మైరాళ్లు దాటుకుని ఒక విజయవంతమైన న్యాయవాదిగా రాణించడం అభినందనీయమని హైకోర్టు మాజీ న్యాయమూర్తి కేసి భాను అన్నారు. న్యాయవాద వృత్తిలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న బొగ్గవరపు గోకుల కృష్ణ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గోకుల కృష్ణ వద్ద పనిచేసిన సీనియర్, జూనియర్ న్యాయవాదుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కాకినాడ బార్ అసోసియేషన్ జరిగింది. ఈ సందర్భంగా పలువురు జడ్జిలు, న్యాయవాదులు గోకుల కృష్ణని ఘనంగా సత్కరించారు.. ఈ సందర్భంగా గోకుల కృష్ణ మాట్లాడుతూ ఈ నా సుదీర్ఘ ప్రస్థానంలో నాకు సహకరించిన న్యాయవాద మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు.. రాబోయే రోజుల్లో మరింతమంది న్యాయవాదులు తీర్చిదిద్ది సమాజానికి అందిస్తానని తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో హైకోర్టు మాజీ న్యాయమూర్తులు బి శేషాశైనా రెడ్డి, కేజీ శంకర్, కాకినాడ జిల్లా జడ్జిలు జి ఆనంది, గోవర్ధన్, జి నాగమణి, పి శ్రీదేవి, కాకినాడ బార్ అసోసియేషన్ ఇంచార్జ్ అధ్యక్షులు పి రామచంద్రరాజు, కార్యదర్శి చెక్కపల్లి చంటి, కమిటీ సభ్యులు, పలువురు సీనియర్ జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు..
