*కర్రి వానిరేవు విజయ దుర్గ అమ్మవారికి ఆషాడం సారె.

    Date:

    📰 Generate e-Paper Clip

    ముమ్మిడివరం .ఆగస్ట్ 09 ( జియస్ బి వార్త) మండలం కర్రివాని రేవు అగ్నికుల క్షత్రియ గ్రామంలో గ్రామస్తులు మాతృమూర్తులు ఆడపడుచులు, విద్యార్థులు గ్రామదేవతలు కాసులమ్మ ధనమ్మ, విజయదుర్గ అమ్మవార్లకు ఆషాడం సారె సమర్పించారు. ఆదివారం ఉదయం నుండి ముందుగా ఆడపడుచులు మంగళ వాయిద్యములతో వృద్ధ గౌతమి నది ఒడ్డుకు చేరి గంగామాతకు పసుపు కుంకుమ సమర్పించి గంగాజలమును తీసుకొని దేవాలయము చేరి విజయదుర్గ అమ్మవారికి పసుపు నీళ్లతో అభిషేకం నిర్వహించారు. అనంతరం పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఆడపడుచులు తీసుకొచ్చిన సారె సమర్పించారు. ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు పర్యవేక్షణలో కార్యక్రమ నిర్వహణ చేయడం జరిగింది.ఈసందర్బంగా కనకారావు మాట్లాడుతూ గ్రామదేవతను ఆడపడుచు గా భావించి ఆషాడ మాసంలో సారె సమర్పించడం వలన అమ్మ దివ్య ఆశీస్సులు అందరి పైన ఉంటాయన్నారు. అలాగే గుడి కేంద్రముగా మన ధర్మ ప్రచారం చేస్తూ ప్రతినెల హారతి భజన సత్సంగం చేస్తూ మన ఆచార సంప్రదాయాలను కాపాడుతూ మన భావితరాలకు అందించాలన్నారు. కమిటీ వారు వచ్చిన భక్తులకు అన్న ప్రసాదం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో కర్రి అన్నవరం, కర్రి సుబ్బారావు, కర్రి కృష్ణారావు, ఓలేటి సూర్యారావు, కర్రి రాంబాబు, పి.వి.విసత్యనరయణ, మల్లాడి విజయగోవిందు, కర్రి ధనుంజయ,ఇల్లింగి తిరపతరాజు కర్రి సత్తిబాబు, పెన్నాడ నాగబాబు తదితరులు పాల్గొన్నారు.

    Share post:

    Subscribe

    Popular

    More like this
    Related

    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!