పుష్కర ఘాట్ల అభివృద్ధికి రూ.11.68 కోట్ల నిధులు మంజూరు:– శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు

    Date:

    📰 Generate e-Paper Clip

    పుష్కర ఘాట్ల అభివృద్ధికి రూ.11.68 కోట్ల నిధులు మంజూరు:– శాసనసభ్యులు   దాట్ల సుబ్బరాజు

    ఐ. పోలవరం ఆగస్ట్ 10 ( జియస్ బి వార్త) ముమ్మిడివరం నియోజకవర్గంలో పుష్కర ఘాట్ల అభివృద్ధికి రూ.11.68 కోట్ల నిధులు మంజూరు: ముమ్మడివరం శాసనసభ్యులు   దాట్ల సుబ్బరాజు

    ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని పుష్కర ఘాట్లను మరింత అభివృద్ధి చేసి, భక్తులు మరియు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది.

    ముమ్మిడివరం నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధిలో మొత్తం 23 పుష్కర ఘాట్ల అభివృద్ధి పనులకు రూ.11 కోట్ల 68 లక్షల మేర నిధులు మంజూరయ్యాయి.

    మండలాల వారీగా మంజూరైన నిధులు, పనుల వివరాలు:
    *కాట్రేనికోన మండలం: 3 పుష్కర ఘాట్లు – రూ.395.94 లక్షలు*

    *ముమ్మిడివరం మండలం: 5 పుష్కర ఘాట్లు – రూ.172.11 లక్షలు*

    *ఐ.పోలవరం మండలం: 12 పుష్కర ఘాట్లు – రూ.464.94 లక్షలు*

    *తాళ్లరేవు మండలం: 3 పుష్కర ఘాట్లు – రూ.135.00 లక్షలు*

    *మొత్తం: 23 పనులు – రూ.11.68 కోట్లు*

    ఈ నిధులతో పుష్కర ఘాట్ల వద్ద అవసరమైన మౌలిక వసతులను అభివృద్ధి చేయడంతో పాటు, భక్తులు, స్థానిక ప్రజలకు సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు చర్యలు చేపట్టనున్నారు.

    ముమ్మిడివరం నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అందిస్తున్న ప్రాధాన్యతకు ఇది మరో నిదర్శనమని, పుష్కర ఘాట్ల అభివృద్ధితో ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలకు మరింత వసతులు సమకూరనున్నాయని ప్రభుత్వ విఫ్ ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజుతెలిపారు.

    ప్రజల అవసరాలకు అనుగుణంగా నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు తెలిపారు

    Share post:

    Subscribe

    Popular

    More like this
    Related

    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!