కాజులూరు రామచంద్రపురం, ఆగస్టు 11
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు నిర్వహిస్తున్న “ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమంలో భాగంగా కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రామచంద్రపురం మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డులో పర్యటించారు.ఈ సందర్భంగా మంత్రి సుభాష్ ప్రతి ఇంటిని సందర్శించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించడంతో పాటు, సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలపై వార్డు ప్రజల స్పందనను అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటిని తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత ప్రభుత్వ అధికారులను ఆదేశించారు.
అనారోగ్యంతో బాధపడుతున్న దొమ్మలపాటి నాగలక్ష్మికి రూ.20,000 ఆర్థిక సహాయం అందించడంతో పాటు, అవసరమైన మెరుగైన వైద్యం అందేలా చూస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అదేవిధంగా ప్రమాదానికి గురై ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న కొండయ్యపాలెపు వెంకన్న బాబుకు రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు.అనంతరం మంత్రి సుభాష్ సమక్షంలో, వార్డు ఇన్‌చార్జి యూనిట్ ఇన్‌చార్జి, బూత్ ఇన్‌చార్జి దొమ్మలపాటి విజయలక్ష్మి, వార్డు వైస్ ప్రెసిడెంట్ కాదా శ్రీను ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో మహిళలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరితో పాటు మాజీ కౌన్సిలర్ పలివెల సీతామహాలక్ష్మి, జగదీష్ తదితరులు కూడా పార్టీలో చేరారు.ఈ కార్యక్రమాన్ని వార్డు కమిటీ, యూనిట్ ఇన్‌చార్జిలు సమన్వయంతో నిర్వహించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్‌చార్జిలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

